కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించాము.. మిగతా డిమాండ్స్ కూడా నెరవేర్చాల్సిందే.. CJP..!

కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం గెలిచింది సీజేపీ నేతలు అన్నారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని తెలిపారు.

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాజీనామాకు తమ ఉద్యమమే కారణమని చెప్పుకున్నారు. “మేము ఇది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు” అని దీప్కే వ్యాఖ్యానించారు. “ఈ రాజీనామా ఒక రుజువు.. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం ముందు తలవంచకపోతే, ఎవరి రాజీనామాను అయినా మనం సాధించగలం” అని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి రాజీనామాతో NEET-UG వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది, అలాగే పరీక్షా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో ఆసక్తి నెలకొంది. …

నిరంతర శాంతియుత నిరసనలు మార్పును తీసుకురాగలవని చెప్పడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక నిదర్శనమని అభిజీత్ దిప్కే తెలిపారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వానికి తలొగ్గకపోతే, మనం ఎవరితోనైనా రాజీనామా చేయించగలమని చెప్పడానికి ఇది నిదర్శనం’ అని అన్నారు.

అలాగే నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లను దీప్కే గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని నిరసనకారులను కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై నిరసన ప్రాంగణంలో విద్యార్థుల సంబరాలు హోరెత్తాయి..

పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించే వరకు, అలాగే జూలై 20న నిరసనకారులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకునే వరకు తాను పదవిని విడిచిపెట్టబోనని ఆయన తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఆయన రాజీనామా చేశారు, కానీ మాకు మరో రెండు డిమాండ్లు ఉన్నాయి అన్నారు…