శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు
దేవరకొండ……..
దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే ఉదయం సుప్రభాతం,మూల విరాట్ కు రుద్రాభిషేకం, అభిషేకం లు నిర్వహించినారు
వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు ప్రసాదం వితరణ చేసినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చీదెళ్ళ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆర్యవైశ్య మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.