వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు..
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గురు పూర్ణిమ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ఆశ్రమాలు, సాయిబాబా ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గురువును దైవస్వరూపంగా భావించి పూజించే పవిత్ర దినమే గురు పూర్ణిమ. విద్యను, జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే రోజుగా దీనికి విశిష్ట స్థానం ఉంది..
గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును గురు పూర్ణిమగా ఆచరిస్తారు..
తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భజనలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు బాబా దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందుతున్నారు. అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఏర్పాటు చేశారు.