మదనపల్లెలో నకిలీ రబ్బరు స్టాంపులపై ఎమ్మార్వో మాధవి హెచ్చరిక
మదనపల్లె, జూలై 30: భూములకు సంబంధించిన నకిలీ రబ్బరు స్టాంపులు, రాజముద్రలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మదనపల్లె ఎమ్మార్వో మాధవి హెచ్చరించారు. ఈ మేరకు మండల పరిధిలో రబ్బరు స్టాంపులు, సీలు తయారు చేసి విక్రయించే వ్యాపారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
భూములకు సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకాలు, డీకేటీ పట్టాలు, ఇళ్ల స్థలాల పట్టాలు తదితర ప్రభుత్వ పత్రాలకు సంబంధించిన నకిలీ రబ్బరు స్టాంపులు, రాజముద్రలు లేదా సీలు తయారు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని ఆమె స్పష్టం చేశారు.
ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో మాధవి