ఆలేరు బందు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆలేరు బంద్కు పిలుపునిచ్చిన ఆలేరు రెవెన్యూ డివిజన్ పోరాట సాధన కమిటీ.
ఆలేరును వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కమిటీ డిమాండ్ చేసింది.
లేనిపక్షంలో ఆలేరు ప్రజలతో కలిసి మరో దశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ డివిజన్ హామీని వెంటనే అమలు చేయాలని కోరింది.
డిమాండ్లు నెరవేరకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఆలేరు బంద్కు ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు సహకరించాలని పోరాట సాధన కమిటీ విజ్ఞప్తి చేసింది..
పట్టణంలోని మెయిన్ రోడ్ మొదలుకుని బైపాస్ రోడ్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి, పోచమ్మ వీధి, కొలనుపాక రోడ్డు, జీడికల్ రోడ్ల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసన కారులు ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని భారీగా నినాదాలు చేశారు. ఈ నెల 31న ఆలేరులోని అన్ని పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆలేరు అభివృద్ధి కోసం జరిగే ఈ బంద్ లో సకల జనులైన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ముక్త కంఠంతో కోరారు.
అనంతరం ఆ కమిటీ సభ్యులు పట్టణ బంద్ సంబంధిత కరపత్రాన్ని పట్టణమంతా నిన్న పంపిణీ చేశారు.