రష్మిక మందన్నకు షూటింగ్‌లో తీవ్ర గాయం.. 6 వారాల విశ్రాంతి సూచించిన వైద్యులు..!

సినిమా షూటింగ్‌లో హీరోయిన్ రష్మికకు గాయం

డాన్స్ చేస్తూ కింద పడిపోయిన రష్మిక

తుంటి భాగంలో బలమైన గాయం అయిందని, ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు..

నేషనల్ క్రష్, పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు, కఠినమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ల చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఆమె హిప్ ప్రాంతంలో టెండన్ డిటాచ్‌మెంట్ (Tendon Detachment) గాయానికి గురైనట్లు సమాచారం. ఈ గాయం తీవ్రత కారణంగా వైద్యులు ఆమెకు కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
వైద్యుల ప్రకారం, ఇలాంటి గాయాలు సాధారణంగా అత్యంత కఠినమైన శారీరక శ్రమ చేసే క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. టెండన్ పూర్తిగా బలపడేందుకు ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని వారు పేర్కొన్నట్లు సమాచారం.
ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో నాలుగు భారీ పాన్-ఇండియా చిత్రాలు ఉండటంతో పాటు దాదాపు 30 ప్రముఖ బ్రాండ్‌లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గాయం కారణంగా ఆయా సినిమాల షూటింగ్‌లు, ప్రకటనల చిత్రీకరణలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.