కొండారెడ్డిపల్లికి బయల్దేరిన సీఎం రేవంత్.
దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి..
కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు.
జమ్మి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్.
సీఎం రేవంత్రెడ్డి దసరా సందర్భంగా స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. స్వగ్రామంలో ఓపెన్ టాప్ జీపులో అందరిని పలకరించుకుంటూ స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…”గ్రామానికి చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లారు. అక్కడ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరికీ దసరా పండుగ ఆయురారోగ్యాలను అందించాలని ఆ దేవుడిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు సీఎం దంపతులకు వేదాశీర్వదాలు అందజేసి తీర్థప్రసాదాలు ప్రసాదించారు..
అంతకు ముందు హెలికాఫ్టర్లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో భారీగా హాజరైన కార్యకర్తలను పలకరించుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చారు. దారిపొడుగునా గజమాలలు, పూలవర్షంతో కార్యకర్తలు, స్థానికులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.