హరీష్‌రావుపై ఆరోపణలు నిరాధారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్.

హరీష్‌రావుపై ఆరోపణలు నిరాధారం..
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్.

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు.
గాంధీభవన్‌ను “గ్రహాచార భవన్”గా మార్చేశారని ఎద్దేవా చేసిన ఆయన, హరీష్‌రావు వ్యక్తిగత వివరాలు సేకరించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
హిందూ సమాజ విశ్వాసాలను అవమానించేలా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్, ఇందుకు కాంగ్రెస్ నాయకులు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 రోజుల పాటు రహస్య ప్రదేశానికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఆయన కూడా క్షుద్రపూజల కోసమే వెళ్లారా?” అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి 12 గంటలకు గృహప్రవేశం చేశారని పేర్కొన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్, “ఆ సమయంలో ఏ మాంత్రికుడిని పిలిపించి పూజలు చేయించారు?” అని ప్రశ్నించారు..