సోషల్ మీడియాలో పరిచయం,,ఆ తర్వాత వివాహం,, డబ్బు,ఫర్నిచర్ తో ఉడాయించిన నిత్య పెళ్లి కొడుకు..పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన దివ్యాంగురాలైన అడ్వకేట్ బాధితురాలు..
సూర్యాపేట జిల్లా…… హుజూర్ నగర్ లో పోలీస్ స్టేషన్ ముందు దివ్యాంగ అడ్వకేట్ నిరసన …
ఇన్స్టాల్ గ్రామ్ , ఫేస్ బుక్ లో పరిచయం అనంతరం పెళ్లి చేసుకున్న మోసపోయి నిత్య పెళ్లి కొడుకు గుంటూరు జిల్లా కు చెందిన షేక్ కరీమూల ను పెళ్లి చేసుకోవడం జరిగింది..
బాధితురాలు (దివ్యాంగురాలు మరియు అడ్వకేట్). తెలిపిన వివరాల ప్రకారం
10 నెల క్రితం షేక్ మౌలాబి దివ్యాంగురాలు, షేక్ కరిముల్లా ను పెళ్లి చేసుకొని హుజూర్నగర్ లో కాపురం ఉండటం జరిగింది… కరెక్ట్ గా రెండు నెలలు తనతో మంచిగా ఉండి నమ్మించి తన వద్ద నుండి సుమారు 7,50 లక్షల డబ్బులు ,, ఫర్నిచర్ తో పాటు స్కూటీని కూడా తీసుకొని వెళ్లిపోయి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడని.. చాలాసార్లు ఫోన్ కూడా ట్రై చేసేసరికి స్విచ్ ఆఫ్ అని వచ్చిందని దీంతో తనకు ఏమో జరిగి ఉంటది అని ఓ చిన్న ఆలోచనతో
8 నెలల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్లు ఆమె తెలిపారు… దివ్యాంగురాలైన తనను నమ్మించి గతంలోనే ఒకరిద్దరితో ఇలానే ప్రేమైన నడిపించి వారి దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేసిన షేక్ కరీముల్లా ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.. తమ పట్ల పోలీసులు కూడా సరిగా వ్యవహరించకపోవడంతో తన బాధని స్థానిక బార్ అడ్వకేట్ సభ్యులందరికీ చెప్పడం జరిగిందని దీంతో వారందరూ కూడా ఐక్యంగా వచ్చి తనకి వెన్నంటే నిలబడ్డారని తెలిపారు.. మతాలు ఒకటి కావడంతో పెద్దల్ని ఒప్పించి పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవడం జరిగిందని ఆమె అన్నారు… గతంలో పెళ్లైన విషయం కానీ వారికి పిల్లలు ఉన్న విషయం కూడా తనకి తెలియదని తెలిపారు… ఇలాంటి చీటర్లని పట్టుకొని కఠినంగా శిక్షించి తనలా ఇంకెవరు ఇబ్బంది పడొద్దు అని పోలీసుల్ని వేడుకుంటున్నట్లుగా తెలిపారు… తాను కష్టపడి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పితే షేక్ కరుములని ఎలా వదిలేస్తారంటూ పోలీసులతో కొంతసేపు వాగ్ వద్దని దిగారు..
నిన్న స్వయంగా బాధితురాలే పోలీసులకి అప్పజెప్పడం జరిగిందని.. తెల్లారేసరికే కరిముల కనిపించకపోవడంతో పోలీసులు నిలదీసిన బాధితురాలు.. అండగా నిలిచిన హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ లు..
SI వివరణ..
తాను హుజూర్నగర్ కి ట్రాన్స్ఫర్ కాకముందు మిస్సింగ్ కేసు నమోదు అయిందని, బాధితురాలు తనని కలిసిన తర్వాత ఆ కేసు పై దృష్టి పెట్టి ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసే పనిని కూడా మొదలుపెట్టామని తెలిపారు.. అందులో భాగంగానే అతను దొరికిన తరువాత బాధితురాలు తరుపు వాళ్లను కూడా పిలిచి మాట్లాడటం జరిగిందని తెలిపారు.. కేవలం మిస్సింగ్ చేసే కాబట్టి బాధితురాలికి అతనిని చూపించి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో ఉంచే పరిస్థితి లేదు కాబట్టి వారిని తెలిసిన వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు.. మోసం చేశారు అని మరో పిటిషన్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి షేక్ కరీముల్లా ని ఎక్కడ ఉన్న అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు..