తమిళనాడు: ఉదయనిధి స్టాలిన్ విడుదల
విజయ్, త్రిషపై వ్యాఖ్యల కేసులో అరెస్టైన ఉదయనిధి.
సెంగిపట్టి PSలో ఉదయనిధిని విచారించిన పోలీసులు.
గంటన్నరపాటు ఉదయనిధిని విచారించిన పోలీసులు.
విచారణ తర్వాత స్టేషన్ బెయిల్పై ఉదయనిధి విడుదల..
తమిళనాడులో సీఎం విజయ్, సినీ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్టైన ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు విడుదల చేశారు. పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను సెంగిపట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సుమారు గంటన్నరపాటు విచారించిన అనంతరం విడుదల చేశారు…కావేరి జలాల అంశంపై జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవిగా విమర్శలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను చెన్నైలోని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను సవాల్ చేస్తూ డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం ఉదయనిధిని విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది..