వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల లాఠీచార్జ్‌..!

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల లాఠీచార్జ్‌

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత

ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులు

గేట్లు వేసి అడ్డుకోవ‌డంతో ఒక్కసారిగా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసుల లాఠీఛార్జ్..

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే ర్యాలీల్లో పాల్గొనవద్దంటూ వైసీపీ నేతలకు పోలీసులు నిన్న రాత్రి నుంచే నోటీసులు జారీ చేశారు.