తుల్జా భవాని దేవాలయ భూమి పూజ లో పాల్గోని 50 భస్థాల సిమెంట్ బహుకరించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్
చింతపల్లి………
చింతపల్లి మండల పరిధిలోని పాలెంతండాలో నిర్మించ బోయే శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ నిర్మాణం లో బాగంగా భూమి పూజ లో పాల్గోని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని తన వంతు సహాయంగా 50 భస్థాల సిమెంట్ ఇస్తానన్నారు . తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు బీల్యా నాయక్ ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హరి నాయక్,మోతిరాం నాయక్,నేనావత్ రాము నాయక్, బాలాజీ,పరమేష్,నర్సిహ్మ,భీమ నాయక్,శంకర్, గోపాల్ కుమార్,హరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.