వికసిత్ భారత్‌-2047 దేశం ముందున్న మహా లక్ష్యం.

2047 నాటికి భారత్‌ను సంపూర్ణంగా వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే దేశం ముందున్న అతిపెద్ద కల అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తే ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూసే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
పెద్ద కలలు కనడం ద్వారా మన ఆలోచనలు కూడా పెద్దవవుతాయని, దేశం కొత్త సంకల్పంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గత 12 ఏళ్లుగా దేశ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన శక్తివంతమైన భారత్‌ను నిర్మించడమే ప్రతి భారతీయుడి సంకల్పంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.