ఆంజనేయ స్వామి గుడి భూమి పూజ లో పాల్గొన్న బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్..

చింతపల్లి ……….
చింతపల్లి మండలం ప్రశాంతపూరి తండాలో నూతనంగా నిర్మించబోయే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్
అనంతరం వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి గుడి నిర్మించడం చాలా శుభ పరిణామం అని స్వామి వారి ఆశీస్సులతో అందరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుబిక్షంగా మెలగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీను నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హరి నాయక్,కేతావత్ గోవర్దన్,మాజి సర్పంచ్ జగన్ నాయక్,కేతావత్ కిషన్ నాయక్,కేతావత్ శ్రీను నాయక్,పరమేష్,రుప్సింగ్ నాయక్,జటావత్ మోతిరాం నాయక్, రవి,బాల్సింగ్, చిన్ను,బావోజి లచ్చిరాం, లచ్చు, నాయుడు,విజయ్, తదితరులు పాల్గొన్నారు.