కరువు రావాలని అఘోరా పూజలు చేశారు!” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో కౌంటర్..!
మాటకు – మాట
రేవంత్ Vs మల్లారెడ్డి.
“కరువు రావాలని అఘోరా పూజలు చేశారు!” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
మాటకు మాటగా సాగిన ఇద్దరి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కౌంటర్‌కు కౌంటర్.. మాటకు మాట.. రాజకీయ వేడి మరింత పెరిగింది.
నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న మల్లారెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
భూములను వివిధ రకాల పద్ధతుల్లో కాజేయడానికి రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ ప్రారంభమైందని మల్లారెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి.. ధరణి విధానంలో మార్పులు చేసి కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు..
రేవంత్ వ్యాఖ్యలు.. మల్లారెడ్డి కౌంటర్‌తో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హీటెక్కింది!
R9TELUGUNEWS.COM