బెగ్గర్ మృతి.. ఇంట్లో 30 సంచుల్లో నోట్ల కట్టలు లభ్యం..

బెగ్గర్ మృతి.. ఇంట్లో 30 సంచుల్లో నోట్ల కట్టలు లభ్యం..

కర్ణాటకలోని మండ్యలో ఘటన..

జీవితమంతా భిక్షాటనతో గడిపిన హూర్ అనే వృద్ధురాలు (68) అనారోగ్యంతో మృతి..

అయితే స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. ఇంట్లో పరిశీలించడంతో 30కి పైగా సంచుల్లో వేలకొద్దీ నాణేలు, నోట్ల కట్టలు కనిపించాయి

ఆ మొత్తాన్ని లెక్కించగా రూ.8,40,000 ఉండడంతో.. ఆమె సోదరుల్లో ఒకరు రూ.6 లక్షలు తీసుకోగా, మిగిలిన డబ్బును మసీదుకు విరాళంగా ఇచ్చిన కుటుంబసభ్యులు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మాండ్యకు చెందిన హూర్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు.ఆ తర్వాత ఆమె ఉంటున్న ఇంట్లో వెళ్లిచూడగా.. అక్కడ 30కిపైగా సంచులు ఉన్నాయి. ఆ బస్తాల్లో నోట్ల కట్టలు ఉన్నాయి.

దానిలో.. రూ.10, రూ.20, రూ.50 నోట్లు భారీగా ఉన్నాయి. వేల సంఖ్యలో నాణేలు కూడా బయటపడ్డాయి. అయితే.. స్థానికులు ఆ సంచులలో ఉన్న డబ్బులను లెక్కించగా.. మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. హూర్‌ సోదరులకు ఈ నగదును స్థానికులు అప్పగించారు.వీరిలో ఒక సోదరుడు రూ.6 లక్షలు తీసుకున్నారు. మరో సోదరుడికి రూ.2.40 లక్షలు దక్కాయి.ఒక సోదరుడు ఈ మొత్తాన్ని ఆయన మసీదుకు విరాళంగా ఇచ్చారు. అయితే.. బతికున్నప్పుడు కనీసం పట్టించుకొని హూర్ సోదరులు చనిపోయిన తర్వాత ఆమె డబ్బుల్ని పంచుకొవడంను చూసి మానవ విలువలు అసలు ఎటుపోతున్నాయని భావొద్వేగంకు గురయ్యారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.