శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌పై గురిపెట్టింది.. రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడి అజేయ 115 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు 300/5తో ముగించిన భారత్‌కు రెండో రోజు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కీలకంగా నిలిచారు. ఏడో వికెట్‌కు ఇద్దరూ కలిసి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 63 పరుగులతో రాణించాడు. అనంతరం జురెల్ దిగువ వరుస బ్యాటర్లతో కలిసి భారత్ స్కోర్‌ను 500 మార్క్ దాటించాడు.
ధ్రువ్ జురెల్ తన టెస్టు కెరీర్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జురెల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. విదేశీ గడ్డపై జురెల్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 117 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 63, యశస్వి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులతో కీలక సహకారం అందించారు. రెండో రోజు ఆటలో సారంశ్ జైన్ 6 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్.. జురెల్‌తో కలిసి భారత్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. పంత్ ఔటైన తర్వాత మానవ్ సుతార్ 18 పరుగులు చేయగా, చివర్లో జురెల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
టీమ్ఇండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ జైస్వాల్ వికెట్ తీసిన ఉత్సాహంలో బౌలర్ అసిథా ఫెర్నాండో, జైస్వాల్‌కు ఘాటైన శైలిలో వీడ్కోలు పలికాడు. పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్న జైస్వాల్, ఫెర్నాండో నుండి ఏదో మాట వినపడటంతో వెనక్కి తిరిగాడు.
ఈ మ్యాచ్ ద్వారా సరన్ష్ జైన్ తన టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అందువల్లే అతడిని జట్టు నుండి తప్పించాల్సి వచ్చిందని గిల్ తెలిపారు.
భారత ఇన్నింగ్స్ ప్రారంభం
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైస్వాల్ మంచి పట్టుదలతో ఆడుతూ ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బంతులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మొదట కాస్త జాగ్రత్తగా ఆడి, ఆ తర్వాత కుదురుకున్నాడు. అయితే, లహిరు కుమార వేసిన ఒక వైడ్ బంతిని ఎడ్జ్ చేసి రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటైన తర్వాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో పడిక్కల్ స్లిప్ ఫీల్డర్ల పక్కగా బంతిని ఎడ్జ్ చేసి కాస్త ఆందోళన చెందాడు.
మరోవైపు యశస్వి జైస్వాల్ క్రీజులో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతను ఎదుర్కొన్న 53 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో వేగంగా 45 పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లు లైన్ లేదా లెంగ్త్ తప్పినప్పుడల్లా జైస్వాల్ బౌండరీలు బాదుతూ వారిపై ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్లో అంతకుముందు మూడు బౌండరీలు సమర్పించుకున్న శ్రీలంక పేసర్ అసిథా ఫెర్నాండో చివరకు చివరి బంతికి విజయం సాధించాడు.
తొలి సెషన్ ముగిసేసరికి భారత్ పరిస్థితి
యశస్వి జైస్వాల్ అవుట్ కావడంతో భారత్ తొలి సెషన్ ముగిసేసరికి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి 66 పరుగుల స్కోరుకు చేరుకుంది. అప్పటివరకు బలంగా సాగిన భారత ఇన్నింగ్స్‌లో జైస్వాల్ వికెట్ పడటంతో శ్రీలంక తిరిగి మ్యాచ్‌లోకి పుంజుకోగలిగింది. కొలంబో పిచ్ కూడా భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకు శ్రీలంక బౌలర్లకు తగినంత సహకారాన్ని అందిస్తోంది.
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ జైస్వాల్ వికెట్ తీసిన ఉత్సాహంలో బౌలర్ అసిథా ఫెర్నాండో, జైస్వాల్‌కు ఘాటైన శైలిలో వీడ్కోలు పలికాడు. పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్న జైస్వాల్, ఫెర్నాండో నుండి ఏదో మాట వినపడటంతో వెనక్కి తిరిగాడు.
ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటూ ముఖాముఖిగా నిలబడ్డారు. మాటల యుద్ధం తీవ్రమవడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తల అసిథా ఫెర్నాండో తలకు స్వల్పంగా తగిలింది. పరిస్థితి మరింత చేయి దాటక ముందే తోటి శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వీరిద్దరినీ విడదీసి ఘర్షణను శాంతింపజేశారు.