కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలి కూతురు కాబట్టే గమ్ముగా ఉన్నాము – జగ్గారెడ్డి

మంత్రి కొండా సురేఖ, సుస్మిత అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పై సురేఖ కుమార్తె సుస్మిత నోరు జారారని జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ సుస్మితకు లేదన్నారు. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని జగ్గారెడ్డి కోరారు. సుస్మిత కాంగ్రెస్ నేత కుమార్తె కాబట్టే ఆగుతున్నామని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని జగ్గారెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కాబట్టే అడ్డుకున్నారని, తెలంగాణ ప్రజలను బీజేపీ అవమానించిందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి సమాచారం లేకుండా పాకిస్తాన్ కు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అమెరికాకు వెళ్లి తెలంగాణకు మరింతగా పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు..