రేపు స్కూళ్లకు సెలవు!
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు), ప్రభుత్వ కార్యాలయాలు రేపు (ఆగస్టు 26న) మూతపడనున్నాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. ఈ నెల 28న (శుక్రవారం) రాఖీ పండగ నేపథ్యంలో ఐచ్ఛిక సెలవు ఉండనుంది. దీనిపై స్థానిక అధికారుల నిర్ణయం మేరకు స్కూళ్లకు సెలవు ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాఖీ పండగతో పాటు వారాంతపు సెలవులు కలిసిరానున్నాయి..
ఆగస్ట్ 26వ తేదీ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సెలవు. ఎందుకంటే మిలాద్ ఉన్ నబీ పర్వదినం కావటం. ఆగస్ట్ 26వ తేదీ బుధవారం సెలవు అయినపోయిన తర్వాత.. 27వ తేదీ యధావిధిగా స్కూల్, కాలేజీలు ఉంటాయి.
ఆ తర్వాత రోజు అంటే ఆగస్ట్ 28వ తేదీ రాఖీ పౌర్ణమి.. ఆ రోజు స్కూల్, కాలేజీలకు సెలవు.. ఆ రోజు శుక్రవారం వచ్చింది. ఆగస్ట్ 29వ తేదీ శనివారం స్కూల్ కు వెళ్లగానే.. ఆ తర్వాత రోజు ఆదివారం.. ఆ రోజు హాలిడే.. మొత్తంగా రోజు మార్చి రోజు పిల్లలకు హాలిడేస్ వచ్చాయి ఈ వారంలో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 26న స్కూళ్లు,కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 26న అధికారికి సెలవుగా ప్రకటించింది. ముందుగా ఆగస్టు 25న సెలవు ఉంటుందని భావించిన విద్యార్థులు ఈ అప్ డేట్ ను గమనించాలని సూచించింది. ఆగస్టు 28న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఐటీ ఉద్యోగులకు శని,ఆదివారాలు కూడా కలిపితే లాంగ్ వీకెండ్ కలిసి రానుంది.