రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఘటన జరిగిన నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం కాకినాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు..కేసు దర్యాప్తు వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. రెండు ఆత్మహత్య లేఖలు ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచాయని తెలిపారు. నూకరాజు రాసిన లేఖతో పాటు, ఆయన కుమార్తె సౌజన్య స్కూటీలో లభించిన మరో లేఖలోనూ సాదిక్ ఖాన్ పేరు స్పష్టంగా ఉందని చెప్పారు. అతని వేధింపులు భరించలేకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారని, ఈ ఆధారాలతోనే దర్యాప్తును ముమ్మరం చేశామని వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఇతర లేఖల గురించి తాము ఇప్పుడేమీ చెప్పలేమని, పక్కా ఆధారాలతోనే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
ఘటన అనంతరం సాదిక్ తన ఫోన్లను స్విచాఫ్ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, ఐదు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. చివరకు మీరట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ, ఐదుగురు సీఐలతో కూడిన బృందం సాదిక్ను విచారించింది. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని కాకినాడ సబ్ జైలుకు తరలించారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దృశ్యం సినిమాలో ఎన్నో ప్లాన్లు వేస్తాడో అలా వేసేడు….. అన్యాయంగా ముగ్గురి ఆత్మహత్యకు కారణమైన కాకినాడకు చెందిన సాధిక్ ఖాన్ కూడా అన్ని స్కెచులు వేసాడు… కాకపోతే ఇక్కడ ఉంది సినిమా పోలీసులు కాదు కదా.. అందుకే వెంటాడి.. వేటాడి పట్టుకున్నారు…ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సాధిక్ కు కంగారెత్తిపోయింది.. ఇక తన పనైపోయింది అనుకున్నాడు.. విషయం తెలియగానే ఫోన్లు, ఎటిఎం కార్డులు, ఉన్న అన్ని ఆధారాలు ఇంటి దగ్గరే వదిలేసాడు.. సామర్లకోట స్టేషన్ కి పరిగెత్తాడు.. కోణార్క్ ఎక్సప్రెస్ రెడీ గా ఉంది… వెంటనే ఎక్కేసాడు… హమ్మయ్య పోలీసుల నుంచి తప్పించుకున్నాను అనుకున్నాడు… కానీ పోలీస్ బ్రెయిన్ మీద తక్కువ అంచనా వేసిన సాధిక్ తెలియకుండానే క్లూలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు..కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కగానే బండిలో ఒకరితో పరిచయం చేసుకుని అతని ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులతో పాటు లాయర్ తో మాట్లాడాడు.. తర్వాత అతను ఫోన్ అతనికి ఇచ్చేశాడు.. కానీ సాధిక్ చేసిన ఈ పనే పోలీసులు అతన్ని వెంటపడేలా చేసింది.. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో పోలీసులు కనుక్కొని వెంటనే అతడిని గుర్తించి ఆరా తీశారు.. అతని గురించి తనకి ఏమి తెలియదని కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్లో దిగిపోయాడని చెప్పాడు.. వెంటనే పోలీసులు ఆ రైల్వే స్టేషన్ కు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు.. అక్కడ ఓ వ్యక్తితో సాధిక్ మాట్లాడాడు.. అతడిని పట్టుకోగా సోలాపూర్ బస్సు గురించి అడిగాడని చెప్పాడు…సోలాపూర్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి మీరట్ ఇలా తాను పోలీసులకు మస్కా కొట్టి వెళ్లిపోతున్నా అనుకున్నాడు కానీ ” ” అంటూ పోలీసులు వెంటపడుతున్న విషయాన్ని సాధిక్ గుర్తించలేదు.. కానీ పోలీసులు నుంచి తప్పించుకునేందుకు మాత్రం రూపం మార్చుకోవాలని అనుకున్నాడు.. గెడ్డం తీసేసాడు… బట్టలు మార్చేశాడు.. కొత్త ఆధార్ కార్డు కోసం కూడా ప్రయత్నించినట్టు సమాచారం.. ఇలా ఎంతగా తప్పించుకోవాలని ట్రై చేసినా చివరికి కన్నింగ్ కాలనాగు కటకటాల పాలయ్యాడు…