నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు తాగునీరు విడుదల..!

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు విడుదల.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నీటితో నింపుకుని, ఆయా ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పల్నాడు జిల్లా .. మాచర్ల నియోజకవర్గం

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగునీరు విడుదల

కుడి జలవిద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ప్రాజెక్ట్ ఈఈ రమేష్ ,జెన్ కో అధికారులు

కుడి కాలువకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్న అధికారులు

కుడి కాలువ పరిధిలోని చెరువులు,కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచన

సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదలైన విద్యుత్ ఉత్పత్తి