మానవత్వం లేదారా మీరు అసలు మనుషులేనా.. రాబందులు మీరు ఒకటేనా.. నేపాల్ లో ఘటనపై సోషల్ మీడియాలో పలువురా అగ్రహం.!

నేపాల్ ఆగస్ట్ 26న సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు, బురద, రాళ్లు, శిథిలాలు దిగువన ఉన్న ప్రాంతాల్ని ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది..నేపాల్ లో ఎక్కడ చూసినా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 500 లకుపైగా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వందలాది మంది విదేశీ పర్యాటకులు, భద్రతా సిబ్బంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు శుక్రవారం ఉదయం నాటికి 1,545 మందిని రక్షించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.

ఓవైపు వరదల్లో కొట్టుకుపోయిన తమ వారి కోసం బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆకతాయిలు రాబందుల్లా మారి చనిపోయిన వారి శరీర భాగాలపై ఉన్న ఆభరణాలు, బంగారాన్ని కాజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వరదల్లో చనిపోయిన మహిళ ఒంటి మీద ఉన్న చెవి కమ్మలు తీసేస్తున్న వీడియో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు ఆ ఇద్దరిని పట్టుకున్నారు. వీడియో ఆధారంగా 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా గుర్తించారు. భరత్‌ పూర్ లోని పోఖరా బస్ పార్క్ దగ్గర వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.