హైదరాబాద్కు రెయిన్ అలర్ట్..
పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికాసేట్లో నగరంలో భారీ వర్షం కురవడబోతున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. వెస్ట్, మిడిల్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలైన గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, మణికొండ, షేక్పేట్, తోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, కార్వాన్, బార్కస్, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, చార్మినార్, గోషామహల్ పరిసర ప్రాంతాలలో రాబోయే గంట వ్యవధిలో 10 నిమిషాల పాటు స్వల్పకాలిక (Short duration) వర్షాలు కురిసే అవకాశం హెచ్చరించారు. కాగా ప్రస్తుతం నగరాన్ని దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది.