గుడిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ డీలర్ సాయికుమార్ కు రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ.. !
గుడిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ డీలర్ సాయికుమార్ కు రేషన్ స్మార్ట్ కార్డు అందజేసినారు
గుడిపల్లి…..
తెలంగాణ ప్రభుత్వ నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గుడిపల్లి గ్రామ రేషన్ డీలర్ పడాల సాయికుమార్ మొదటి కార్డు గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గోలి చిన్న రాములు కి ఇవ్వడం జరిగింది గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2026న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్(ఆహార భద్రత) కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈవిడత లో మొత్తం 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు (1.06 కోట్ల కార్డులు) ఏటీఎం సైజులో యువర్ కోడ్ తో కూడిన ఆధ్యాత్మిక స్మార్ట్ కార్డులను అందజేస్తున్నారు అందులో భాగంగా గుడిపల్లి రేషన్ షాప్ కి సంబంధించి 976 కార్డులను గుడిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ డీలర్ సాయికుమార్ చేతులకు అందించడం జరిగింది అధిక భద్రతా ఫీచర్లు నకిలీలను అరికట్టడానికి ఈ కార్డులలో హోలోగ్రామ్, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ (QR) కోడ్, వాటర్మార్క్, యూవీ (UV) లోగోతో పాటు మొత్తం 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లు పొందుపరిచారు.క్యూఆర్ కోడ్ విధానం కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కుటుంబానికి సంబంధించిన పూర్తి రేషన్ వివరాలు క్షణాల్లో లభిస్తాయి.ఉచిత పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది, లబ్ధిదారుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయరు.ఉచిత సన్నబియ్యం అర్హులైన పేద కుటుంబాలకు మనిషికి 6 కిలోల చొప్పున వంద శాతం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం పేదల పట్ల దూర దృష్టితో ఆలోచనల భాగంగా ఈ స్మార్ట్ కార్డులు అందించడం జరుగుతుందని సర్పంచ్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అర్వపల్లి శ్రీను వార్డు సభ్యులు కత్తుల రమేష్ బోడ నాగరాజు ఎర్ర వంశీకృష్ణ గణపురం రాధిక యాదగిరి వొటెపు శ్రీను మాజీ ఉమ్మడి మండల వైస్ ఎంపీపీ అరవపల్లి సరిత నరసింహ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి మాజీ సర్పంచ్ మోపురి ఆంజనేయులు గణపురం సైదులు పోలే వెంకట్ మర్రి కృష్ణయ్య గణపురం యాదయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.