*సూర్యాపేట జిల్లా..*
కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసిన BRTU నాయకులు..

కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ BRTU ఆధ్వర్యంలో వినతి..
బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుతో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు తరలి వచ్చిన కార్మికులు..
కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన BRTU రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు..
మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మీడియా తో మాట్లాడిన BRTU రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, దేశపాక్ మహేష్. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు.