Konda Surekha to meet followers
హైదరాబాద్‌లో నేడు మంత్రి కొండా సురేఖ దంపతులు తమ అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది…
హైకమాండ్‌తో జరిగిన చర్చల వివరాలను అనుచరులతో పంచుకోనున్న కొండా దంపతులు.. తదుపరి రాజకీయ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ భేటీ అనంతరం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై కొండా దంపతులు స్పందించనున్నట్లు సమాచారం.
దీంతో సాయంత్రం కొండా దంపతులు చేసే వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వారి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.