ట్రంప్‌కు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాబోతోందనే వార్తలు తీవ్ర కలకలం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాబోతోందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి..ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ అందించిన వివరాల ప్రకారం.. ఈసారి రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని కోల్పోయి, డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఐదు సీట్ల ఆధిక్యంతో ఉన్న రిపబ్లికన్ పార్టీ, ఈసారి ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. తాజా అంచనాల ప్రకారం విపక్ష డెమోక్రాట్లు అదనంగా 10 సీట్లు సాధించి, ఏకంగా 230 స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతున్నారు. మరోవైపు అధికార రిపబ్లికన్ అభ్యర్థులు కేవలం 205 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో రిపబ్లికన్లకు 218 మంది ఎంపీల బలం ఉండగా, డెమోక్రాట్లకు 214 మంది సభ్యులు ఉన్నారు. ఈ గణాంకాలు తలకిందులైతే ట్రంప్ సర్కారుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.