శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

22A లాంటి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రేవంత్ సర్కార్ మరో కుట్ర

సభ జరగనున్న అన్ని రోజులు ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం

ప్రజా సమస్యలపై చర్చకు భయపడి ఈ నిర్ణయం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు

ఏకపక్షంగా తీర్మానాన్ని ఆమోదించి సస్పెండ్ చేసిన స్పీకర్..అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు.

శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు ఆరోపణలు చేసిన ప్రభుత్వ mla లు .