కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల అద్దెలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉన్నది..పేరుమల్ల సతీష్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల అద్దెలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పేరుమల్ల సతీష్ అన్నారు ఈరోజు పాలకీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న పాలకీడు మండలంలోని ఎమ్మార్వో కార్యాలయానికి రెండు సంవత్సరాల నుండి అద్దె చెల్లించడం లేదని ఆ ఇంటి ఓనరు నిన్న ఎమ్మార్వో ఆఫీస్ కు తాళం వేసి అధికారులను లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఈరోజు అన్ని పేపర్లలో టీవీలలో ఆ ప్రకటనలు రావడం రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యనికి గురిచేయడం జరిగింది .కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేవలం వాళ్ళ విలాసాలకు హెలికాఫ్టర్లను వాడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లించే సోయిలేకుండా దుర్మార్గంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది అని అన్నారు పదేళ్ల కెసిఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్రం కొత్తగా ఏర్పడి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అద్దె భవనాలలోని పరిపాలనను కొనసాగించడం జరిగింది కానీ ఏ ఒక్కరోజు కూడా అద్దె చెల్లించడం లేదని ఆ కార్యాలయాలకు తాళాలు వేసిన దాఖలాలు రాష్ట్రంలో పదేళ్లలోఎక్కడ కూడా కనిపించలేదని గుర్తు చేశారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతకాకపోతే వెంటనే దిగిపోవాలని లేదా రాష్ట్ర ప్రజలను సక్రమంగా పరిపాలించే తెలివిని నేర్చుకోవాలి సలహా ఇచ్చారు లేని పక్షంలో మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు తోడుగా ఉండి పోరాడుతుందని హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో వెంకటనాయిడు,వెంకటేశ్వర్లు, రమేష్ నాయక్, వీరబాబు, శేఖర్,నరేందర్,వేణు,తదితరులు పాల్గొన్నారు