తాగునీటికి ఇబ్బంది పడుతున్న పందిరిగుండు తండా వాసులు..!

నల్లగొండ జిల్లా ……
దేవరకొండ…….

తాగునీటికి ఇబ్బంది పడుతున్న పందిరిగుండు తండా వాసులు..

ఎల్ నినో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు..

ఎండిన మొండి కత్వ వాగు, ఊటబావి..

తాగునీటి కోసం వాగులోకి బిందెలతో వెళ్తున్న మహిళలు..

పెండ్లిపాకల ప్రాజెక్టునుండి విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికుల డిమాండ్..

సమస్యకు పరిష్కారం అంటున్న స్థానికులు

నల్లగొండ జిల్లా.
నేరేడుగోమ్ము మండలం పందిరి గుండు తండా గ్రామపంచాయతీ పరిధిలో పై మూలతండా,
కింది మూల తండ, ఇంద్రావత్ తండా తో కలిపి నాలుగు తండాలు ఉన్నాయి.. మొత్తం మూడు వేల జనాభా నివసిస్తున్న నాలుగు తండాలకు సమీపంలోని మొండికత్వ వాగులోని ఊటబాయి తాగునీరుకు ఆధారమైంది. వాగులో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఊట బావిలోకి నీరు చేరడం అక్కడినుంచి మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని పంపించేసి తండావాసులకు తాగునీటి సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం ఎల్ ఇనో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల ఏర్పడడం వాగు పూర్తిగా ఎండిపోవడంతో ఊట బావి అడుగంటి పోయింది. దీంతో తండా వాసులకు తాగునీటి కోసం ఇబ్బందులు పడక తప్పట్లేదు.. పూర్తిగా అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉన్న తండాలకు ఆనుకొని ఉన్న బావిలోకి తీసుకొని మహిళలు నీటిని తీసుకొస్తున్న పరిస్థితి. తండా పక్కనే ఉన్న వాగులోకి పొలాలకు గట్ల మీదుగా వెళ్లి బిందెలతో నీటిని తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటి ఇబ్బంది విషయమై సర్పంచు దృష్టికి తీసుకు వెళ్ళామని ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామని..ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన మహిళలు కోరుతున్నారు.

పైన ఉన్న పెండ్లి పాకల ప్రాజెక్టు నుండి మొదటి కాలువ ద్వారా నీరును విడుదల చేసి వాగులోకి నీరు చేరడంతో ఊట బావి లో నీటి స్థాయి పెరుగుతుందని తద్వారా మోటార్ల ద్వారా ట్యాంకులకు నీరు పంపించి తండావాసులకు తాగునీటి సరఫరాకు సులభతరం అవుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.