వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం
దేవరకొండ…….
వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ దేవరకొండ ఆధ్వర్యంలో
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు పుట్టినరోజు మరియు వీరెల్లి సతీష్ కుమార్ V 104 A గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ వనిత గ్రేటర్ దేవరకొండ మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సిద్ధి వెంకట సూర్య ప్రకాష్ రావు పేరు గోత్రనామాలతో మరియు మీరెల్లి సతీష్ కుమార్ పేరు గోత్రనామాలతో అర్చన చేయడం జరిగినది అనంతరం స్థానిక బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది తగానంతరం వయోవృద్ధ ఆశ్రమం మరియు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మరియు వివిధ పాఠశాలలో 50 మొక్కలు నాటడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ అధ్యక్షులు పందిరి జ్యోతి కార్యదర్శి బెజవాడ మల్లేశ్వరి కోశాధికారి ఆలంపల్లి శిరీష డిస్టిక్ జాయింట్ సెక్రటరీ నీలా సంజీవ్ కుమార్ డిస్టిక్ జాయింట్ ట్రెజరర్ ఆలంపల్లి పద్మ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.