నేటి నుంచి ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు…!

నేటి నుంచి ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు.

R9TELUGUNEWS.COM.న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజుల పాటు బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి బ్రిక్స్‌ సభ్య దేశాలకు చెందిన 11 మంది దేశాధినేతలు హాజరుకానున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు.
సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీవీఐపీల రాకపోకల కారణంగా మూడు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు, మార్గాల మళ్లింపు చేపట్టనున్నారు.
ఇక ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకానుండటం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రానుండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. బ్రిక్స్‌ వేదికగా భారత్‌–చైనా ద్వైపాక్షిక అంశాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది