పహారా కాస్తున్న భారత నేవీ నౌకను ఢీ కొట్టిన పాకిస్థాన్‌ యుద్ధనౌక..!

అరేబియా సముద్రంలో పాకిస్థాన్ మరోసారి తోకజాడించింది. అక్కడ పహారా కాస్తున్న మన భారత నేవీ విభాగాన్ని పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక ఒకటి వచ్చి బలంగా ఢీకొట్టింది..ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు, పెద్ద నష్టమూ జరగలేదు. కానీ, అంతర్జాతీయ జలాల్లో పాక్ నౌక చేసిన ఈ పనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యవేత్తను (ఛార్జ్ డి అఫైర్స్) పిలిపించి గట్టిగా చీవాట్లు పెట్టింది.

పాక్ ప్రవర్తనపై భారత్ సీరియస్:
Collision between a Pakistani naval unit and an Indian Navy ship …
పాకిస్థాన్ నేవీ వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని, పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉందని భారత్ మండిపడింది. 1991 ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. అందులోని ఆర్టికల్ 10ని పాక్ నౌక ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది. సైన్యం అన్నాక కాస్త పద్ధతిగా, జాగ్రత్తగా ఉండాలని చురకలంటించింది. మరోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. అటు ఇస్లామాబాద్‌లోని భారత అధికారులు కూడా పాక్ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పనున్నారు.