మా ఎన్నికల అఫిడవిట్లో ఉన్న భూములే చూపించి రేవంత్ మా మీద ఆరోపణలు చేస్తున్నాడు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
దారి తప్పిన వాస్కోడిగామా అమెరికాని కనుక్కోబోయి ఇండియాకి వచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు..
పాపం రేవంత్ రెడ్డి దొరికిపోయిన దొంగ..
ఆరోజు ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో రేవంత్ రెడ్డి దొరికినట్లు.. ఇవాళ కూడా భూ భారతిని భూహారతి చేసి అలానే దొరికాడు..
కాసేపు ఏమో నిజం పాలనలో రెవెన్యూ రికార్డులే లేవు మా ఆంధ్ర వాళ్లే వచ్చి ఇచ్చారని మాట్లాడిండు.
మళ్లీ కాసేపు ఏమో 1908 నుండి మొదలైందని నిజం మీద నూకేశాడు..
వీటి నుండి తప్పించుకోడని కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నా పైన ఆరోపణలు చేశాడు..
మా ఎన్నికల అఫిడవిట్లో ఉన్న భూములే చూపించి మా మీద ఆరోపణలు చేస్తున్నాడు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ కుంభకోణం మితిమీరి పోతుంటే ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు అని అన్నారు.. ఓటుకు నోటు కేసులో డబ్బులు సంచులు తీసుకు వెళ్తూ అడ్డంగా దొరికిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.