నదులు, చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనం చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు …!

అనంతపురం జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు తలదాచుకుంటున్నాయి. నదులు, చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనం చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో చిత్రవతి నదిలో నీరు లేకపోవడంతో, భక్తులు విగ్రహాలను నదిలోనే వదిలేయాల్సి వచ్చింది. పుట్లూరులో కూడా చెరువులు ఎండిపోవడంతో, అక్కడ ఉన్న కొద్దిపాటి నీటితోనే నిమజ్జనం చేశారు.

పండుగ వేళ కూడా నీటి కొరత భక్తులకు పెద్ద సమస్యగా మారింది.