బుల్లెట్ ట్రైన్ పాత అలైన్మెంట్ నే కొనసాగించాలి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ ఏర్పాటు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఆయనతో పాటు పాల్గొన్న అకిలపక్ష నేతలు, స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న పట్టణ వ్యాపారస్తులు, అన్ని రంగాల ప్రజలు.

*మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…

బుల్లెట్ ట్రైన్ పాత అలైన్మెంట్ నే కొనసాగించాలి..

ప్రస్తుత అలైన్మెంట్ తెలంగాణా కు ఏమాత్రం ఉపయోగం లేదు..

ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ నుండి బుల్లెట్ ట్రైన్ మార్గం ప్రతిపాదించడం ఎవరి కోసం..

చౌటుప్పల్ , సూర్యాపేట , కోదాడ మీదుగా రైల్ మార్గం ఉంటే నల్లగొండ , వరంగల్ , ఖమ్మం జిల్లాలకు ఉపయోగపడుతుంది..

జనంలేని మార్గంలో సీఎం కొనుక్కున్న 3 వేల ఎకరాల కోసం రైల్వే లైన్ తీసుకెళ్లడం ఆయనతో పాటు ఆంధ్రాకు లాభం చేయడమే…

సకల జనుల ఆకాంక్ష మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత అలైన్మెంట్ యాదాతధంగా కొనసాగించాలి..

ఎన్ హెచ్ 65 హైద్రాబాద్ – విజయవాడ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కేటాయించేవరకు ఉద్యమాలు ఉదృతం చేస్తాం..

చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రంగాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ర్యాలీలో పాల్గొనడం అభినందనీయం..

సూర్యాపేట ప్రజలందరి ఆకాంక్ష మేరకు స్థానిక శాసన సభ్యునిగా జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో నా వంతు మద్దతు ఉంటది..