రాబోయే రోజుల్లో ఐరోపా దేశాల భూభాగాల పైకి ఈ సెగ విస్తరించే దిశగా ఉక్రెయిన్..!

ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుందని భావించవచ్చు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం యావత్ యూరప్ ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసేలా చేసింది..ఇప్పటివరకు యుద్ధక్షేత్రం ఉక్రెన్ సరిహద్దులకే పరిమితం కాగా.. రాబోయే రోజుల్లో ఐరోపా దేశాల భూభాగాల పైకి ఈ సెగ విస్తరించే ప్రమాదం కనిపిస్తోందని భద్రత నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటున్న యూరప్ దేశాలను లక్ష్యంగా చేసుకొని మాస్కో సరికొత్త యుద్ధ వ్యూహాలను సిద్ధం చేస్తోందని నిఘా వర్గాల సమాచారంతో యూరోపియన్ యూనియన్ తో పాటు నాతో కూటమి దేశాలు ఒక్కసారిగా హై అలర్టును ప్రకటించాయి.

పోలాండ్ ప్రధానమంత్రి డోనాల్డ్ టస్కు చేసిన వ్యాఖ్యలు ఐరోపా దేశాల్లో కలకలం రేపుతున్నాయి.. ఉక్రెయిన్ కు ఆయుధాలతోపాటు ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాలపై రష్యా ఏక్షణమైన ప్రతీకార దాడులకు దిగొచ్చని ఆయన ఇటీవల బాంబు పేల్చారు. నేరుగా యుద్ధాన్ని ప్రకటించకుండా.. అత్యాధునిక డ్రోన్లతో విరుచుకుపడటమే కాకుండా.. కీలక మౌలిక వసతుల వ్యవస్థలను స్తంభింపజేసే భారీ సైబర్ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు..