సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం..

*సూర్యాపేట జిల్లా..*

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి 365 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలమర్రి సమీపంలో వోల్వో కారు అదుపు తప్పి అతి వేగంగా వచ్చి డివైడర్ ఢీకొని హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పూర్తిగా మంటల్లో చిక్కుకోని కాలి పోయినట్లు పోలీసులు తెలిపారు. కారు ఖమ్మం నుండి హైదరాబాదు వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పీ వేశారు.
ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు..
ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది..