ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం..

ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం..

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్‌

శాఖలో ఉద్యోగుల కేటాయింపునకు బ్రేక్‌

పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్‌ విద్య కొనసాగింపు

సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు

సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలి యథాతథంగా కొనసాగింపు

డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదని స్పష్టత

AICTE అంశాలు, పరీక్షల విధానం పాత పద్ధతిలోనే కొనసాగింపు

35 రోజులుగా కొనసాగిన విద్యార్థులు, అధ్యాపకుల పోరాటం

అధ్యాపకుల సహాయ నిరాకరణతో దిగొచ్చిన ప్రభుత్వం ..

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. శాఖలో ఉద్యోగుల కేటాయింపునకు బ్రేక్ పడగా, పాలిటెక్నిక్ విద్య పాత పద్ధతిలోనే కొనసాగనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే ఉంటాయి.

పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. జీవో 97ను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన 37 రోజుల నిరసనకు ప్రభుత్వం తలొగ్గింది. దీంతో విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంధన శాఖలో ఉద్యోగుల కేటాయింపుల సమస్య కూడా పరిష్కారమైనట్లు కనిపిస్తోంది.

పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు జూలై 3న జారీ చేసిన జీవో 97 విద్యార్థి, అధ్యాపక వర్గాల ఆగ్రహానికి గురిచేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంధన శాఖలో ఉద్యోగుల కేటాయింపుల విషయంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితిపై కేకే కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది.

దీంతో పాలిటెక్నిక్‌ల విలీన ప్రతిపాదనపై ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. అందువల్ల, డిప్లొమా విద్య యథావిధిగా కొనసాగుతుంది. కళాశాలలు సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే ఉంటాయి. అదేవిధంగా, సాంకేతిక విద్యా మండలి, ఏఐసీటీఈ విధానాలు యథాతథంగా కొనసాగుతాయి. దీంతో విద్యార్థి, అధ్యాపకుల 37 రోజుల పోరాటం ఫలించింది…