నేటి పంచాంగం..

R9TELUGUNEWS.COM..

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 10 గం॥ 39 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 27 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న సాయంత్రం 4 గం॥ 9 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 39 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 57 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 30 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 46 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 35 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 50 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : సింహము

మేషం?
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య 3

వృషభం?
చేపట్టిన పనులలో అవరోదాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.
అదృష్ట సంఖ్య 2

మిథునం?
కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
అదృష్ట సంఖ్య 9

కర్కాటకం?
నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య 4

సింహం?
చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.
అదృష్ట సంఖ్య 2

కన్య?
నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.
అదృష్ట సంఖ్య 1

తుల⚖️
చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగవకాశాలు లభిస్తాయి విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు.
అదృష్ట సంఖ్య 3

వృశ్చికము?
ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి.
అదృష్ట సంఖ్య 5

ధనస్సు?
నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు.
అదృష్ట సంఖ్య 2

మకరం?
సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య 2

కుంభం⚱️
చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
అదృష్ట సంఖ్య 9

మీనం?
ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
అదృష్ట సంఖ్య 6