తెలంగాణలో కృష్ణా జలాలు వెలవెల.. ఆంధ్రాలో కృష్ణా జలాలు గలగల!.

తెలంగాణలో కృష్ణా జలాలు వెలవెల.. ఆంధ్రాలో కృష్ణా జలాలు గలగల!.

ఒకే కృష్ణా నది.. రెండు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు

నీటి లభ్యత, వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణపై మళ్లీ చర్చ..

కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి చర్చ మొదలైంది.

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ జలాశయాలకు వచ్చే ప్రవాహాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. భూగర్భ జలమట్టాలు గత ఏడాదితో పోలిస్తే బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో వెలిగొండ పేరుతో నీరు తరలించటం ఒకింత బాధాకరం. మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా గత దశాబ్దన్నర కాలంలో ఏపీ వైపు నుంచి కృష్ణా జలాల తరలింపు పదేపదే జరిగింది, ప్రతిసారి ‘అత్యవసర తాగునీటి అవసరం’ అనే వాదననే ముందుకు తెచ్చారు. ఆ పరంపరలో తాజాగా ఇప్పుడు వెలిగొండ కు,, కుప్పం కు చేర్చారు..

తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం..

ఒకవైపు తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాజెక్టులు, కాలువలు, సాగునీటి అవసరాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. తెలంగాణ వ్యాప్తంగా పంట పొలాలు ఎండి నెర్రలు బాస్తుంటే, నీరు అందించండి మహాప్రభువు అంటూ రైతులుగా గోలు పెడుతున్నారు… ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకాలతో రైతులు సబ్స్టేషన్లు ముట్టడి కార్యక్రమాలు కూడా పెట్టుకుంటున్నారు.. మరికొందరు రైతులు ఒక అడుగు ముందుకేసి ప్రాజెక్టు కాలవ గేట్లే తెరిచి నీటిని వదులుకునే పరిస్థితికి వచ్చింది.. పంట లేకపోతే ఎలా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువేడుకుంటున్నారు
పంటలను కాపాడండి మహాప్రభువు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు…

పూర్తిగా ఎండిపోయిన చెరువులు కుంటలు.. తాగునీటికి కటకటగా మూగజీవాలు ఆలమటిస్తున్నాయి.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

ఆంధ్రాలో కలకలలాడుతున్న కృష్ణమ్మ..,

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, దిగువకు నీటి విడుదలలు కొనసాగుతున్నాయి..

ప్రస్తుత నీటి సంవత్సరం వర్షపాతం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాహాలు, ప్రాజెక్టుల నిర్వహణ, తాగునీరు–సాగునీరు–విద్యుత్ అవసరాల మధ్య సమన్వయం వంటి అంశాలు కృష్ణా జలాల పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.

శ్రీశైలం చుట్టూ మళ్లీ జల వివాదం.

శ్రీశైలం జలాశయం కృష్ణా జలాల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 21 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌లో సుమారు 99.98 టీఎంసీల నీరు, అంటే దాని మొత్తం సామర్థ్యంలో 46.3 శాతం నిల్వ ఉన్నట్లు నమోదైంది. అదే సమయంలో 8,250 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం నీటి వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి… నీటి కొరత పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగించడంపై జాగ్రత్త అవసరమని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలు చేసింది..

తెలంగాణ ప్రభుత్వం పరిస్తితి ఏమిటి?.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని బట్టి నీటి రావటడంలో పూర్తిగా విఫలమైందనే తెలంగాణ రైతాంగం విమర్శలు గుప్పిస్తున్నారు…

నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటి ప్రవాహం వంటి అంశాలను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. సెప్టెంబర్ 8న జరిగిన చర్చల్లో కూడా తెలంగాణ తన ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుదుత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది..

ఇదే సమయంలో తెలంగాణలో కృష్ణా నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇటీవల జూరాల నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ కూడా చేస్తున్నారు… నేరుగా రైతులే డ్యాము కు సంబంధించిన కాలువగేట్లని తొలగించడం జరిగింది…

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి?.

ఆంధ్రప్రదేశ్‌లోనూ నీటి అవసరాలు తక్కువేమీ కావు. రాయలసీమ, పల్నాడు, తాగునీటి అవసరాలు తదితర అంశాలపై రాష్ట్రం కృష్ణా జలాలను కోరుతోంది. కృష్ణా నీటి వినియోగంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి సెప్టెంబర్ 20న నమోదైన గణాంకాల ప్రకారం 27.49 టీఎంసీల నీటి నిల్వ, 60.1 శాతం నిల్వ సామర్థ్యం నమోదైంది.

అసలు సమస్య ఎక్కడ?.

కృష్ణా నది ఒకటే అయినా.. దాని నీటిని ఎప్పుడు, ఎంత, ఏ ప్రాజెక్టు ద్వారా వినియోగించాలి అన్నదే ప్రధాన ప్రశ్న.
వర్షపాతం తక్కువగా ఉన్న సంవత్సరాల్లో ఈ సమస్య మరింత సున్నితంగా మారుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను కాపాడుకోవడం, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వడం, సాగునీటి అవసరాలను తీర్చడం, విద్యుదుత్పత్తి వంటి అవసరాల మధ్య సమతుల్యత సాధించడం కీలకంగా మారుతోంది.
కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న వాటా, వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివాదాలకు తోడు.. ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితులు మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి.

రైతుల చూపు మాత్రం కృష్ణమ్మ వైపే!.

రాజకీయాలు, నీటి వాటాల లెక్కలు, ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉన్నా.. చివరికి కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్న రైతుకు కావాల్సింది సాగునీరు.. ప్రజలకు కావాల్సింది త్రాగునీరు..

రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?
ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో ఎంత నిలువలు ఉన్నాయి ఎవరు ఎప్పుడు తరలించకపోతున్నారు. ..

కృష్ణా జలాలు ఎవరి హక్కు అన్న దానితో పాటు.. అందుబాటులో ఉన్న నీటిని ఎలా సమర్థంగా వినియోగించాలి అన్నదే ఇప్పుడు అసలు సవాల్.

కానీ ప్రస్తుతం నీటి వాటాన్ని చూస్తే లెక్క పత్రం లేకుండా ఆంధ్ర ప్రభుత్వం యదేచ్చగా తరలించకపోతుందని అభియోగాలు BRS పార్టీ చేస్తున్న అభియోగాల వేళ ప్రస్తుతం ఆంధ్రాలో పారుతున్న నీటిని చూస్తే అది నిజమనే అనుకోవాల్సి వస్తోంది..

కుప్పానికి కృష్ణమ్మ.…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam) నియోజకవర్గ ప్రజలకు ఎంతో కాలంగా కంటున్న కల నిజమైంది. కృష్ణా నది (Krishna River) జలాలు హంద్రీ-నీవా (Handri-Neeva) కాలువ ద్వారా కుప్పానికి చేరాయి.

కుప్పం ప్రాంతానికి మరోసారి కృష్ణా జలాలు చేరుకోవడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం నుంచి వచ్చిన కృష్ణా జలాలు కుప్పం వైపు ప్రవహిస్తున్నాయి. రామకుప్పం వద్దకు నీరు చేరడంతో రైతులు, ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. కాలువ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసి జలహారతి ఇచ్చి సంబరాలు చేసుకున్నారు..

మొత్తం కుప్పం నియోజకవర్గంలో 554 చెరువులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా వర్షాభావం వల్ల ఇవి ఎండిపోయాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బావులు కూడా పనికిరానివి అయ్యాయి. కర్ణాటక (Karnataka) సరిహద్దుల్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశముందని ప్రజలు భయపడ్డారు. అలాంటి సమయంలో హంద్రీ-నీవా నీళ్లు కుప్పానికి చేరుకోవడం రైతులకు కొత్త ఆశను కలిగించింది.

ఆంధ్రాలో చివరి భూమికి కూడా నీరందుతుంటే. తెలంగాణలో మాత్రం కిష్ట పక్కన ఉన్న గొంతు ఎండుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…