ఫలించిన రైతుల పోరాటం..
కాంగ్రెస్ ప్రభుత్వం ని జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయించుకున్న పాలమూరు రైతులు..
రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళనలతో ప్రభుత్వం పై ఒత్తిడి రావడం కూడా ఒక కారణం అంటూ రైతులు తెలుపుతున్నారు..
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు చేసిన పోరాటానికి ఎట్టకేలకు నీళ్ళు వదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం..
జూరాల ప్రాజెక్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూరు మండలాల రైతుల పోరాటం ఫలించింది. సాగునీటి కోసం రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని నిన్న(సోమవారం) మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం ప్రాజెక్ట్ సీఈతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులను వివరించారు..