దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్… యాప్ కింగ్ పిన్ HYD ఎయిర్పోర్టులో అరెస్టు…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ Mahadev Betting App Scamస్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, ప్రధాన కింగ్పిన్లలో ఒకడైన అభిషేక్ కుమార్ను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తుండగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహాదేవ్ బుక్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో, ప్యానెళ్లను సమన్వయం చేయడం, నిధుల సేకరణలో అభిషేక్ కుమార్ చురుగ్గా వ్యవహరించాడని సీబీఐ విచారణలో తేలింది. బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతో దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సీబీఐకి ఆధారాలు లభించాయి.
అభిషేక్ అరెస్ట్ సమయంలో అతడి వద్ద ఉన్న పలు కీలక ఆధారాలు, పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితులు సౌరభ్ చంద్రకర్, శుభం సోనీలతో కలిసి ఇతడు పనిచేశాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అరెస్ట్ అనంతరం నిందితుడిని హైదరాబాద్ స్థానిక కోర్టులో హాజరుపరిచి 3 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. అనంతరం రాయ్పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా 2 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.