పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్..

పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్..

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.

*2026 నవంబర్ 1ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.*

తేది :01-11-2023 కంటే ముందు
డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AERO లకు లేదా నియమిత అధికారికి సబ్మిట్ చేయాలన్నారు

సెప్టెంబర్ 28 న నోటిస్ ను ERO, అదనపు కలెక్టర్ జారీ చేయనున్నారు

అక్టోబర్ 15, 25న పత్రికల్లో నోటీసుల పునఃప్రచురణ ఉంటుంది.

నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు.

నవంబర్ 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తిచేసి,

నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

అదే రోజునుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు.

డిసెంబర్ 25లోగా వాటిని పరిష్కరించి సప్లిమెంట్లను సిద్ధం చేస్తారు.

డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు..

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం 2027 మార్చితో ముగియనుండటంతో ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు..