నేడు చలో విజయవాడకు గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు..
ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయాలని డిమాండ్
సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్..
అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలనికోరుతున్న ఉద్యోగులు..
చలో విజయవాడకు అనుమతులు లేవంటున్న పోలీసులు..
సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులపై
చంద్రబాబు ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపునకు దిగింది అంటు ఉద్యోగుల ఆరోపణలు ….
చలో విజయవాడకు పిలుపునిచ్చారన్న నెపంతో విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రణస్థలం మండలం జె.ఆర్.పురం సచివాలయ సర్వేయర్ బూరాడ మధుబాబును సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సర్వేయర్లను రెచ్చగొట్టారని, తుపాను అత్యవసర సమయంలో విధులకు, రీసర్వేకు ఆటంకం కలిగించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మధుబాబు సంఘాన్ని గుర్తింపు లేని సంఘంగా ఉత్తర్వుల్లోనే పేర్కొనడం గమనార్హం…
ఈ పరిస్థితులను దృష్ట్యా, శాంతిభద్రతలకు, ప్రజా సౌకర్యానికి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ వారు సచివాలయ ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి అనుమతిని నిరాకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ సిబ్బంది ప్రస్తుత అత్యవసర పరిస్థితులను అర్థం చేసుకుని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా ధర్నాలు, నిరసనలు లేదా చట్టవిరుద్ధంగా కూడళ్ల వద్ద సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ధర్నా ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని, పోలీస్ వారికి సహకరించాలని కూడా కోరారు..