సినిమా కొత్తగా తీసాం అనుకుంటే రివ్యూలు కూడా కొత్త కొత్తగా ఇచ్చారు. నాని..
మరో పదేళ్లు ‘ఆయా షేర్' వినిపిస్తుంది..
సినిమా కొత్తగా తీసాం అనుకుంటే రివ్యూలు కూడా కొత్త కొత్తగా ఇచ్చారు. నాని..
మరో పదేళ్లు ‘ఆయా షేర్’ వినిపిస్తుంది...
ప్రతి సినిమాకి ముందు పాజిటివ్ టాకీ వచ్చి సాయంత్రం తర్వాత నెగిటివ్ టాక్ వచ్చేది..
కానీ ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాకీ వచ్చి.. సమయం గడిచే కొద్దీ పాజిటివ్ టాక్ రావడం విచిత్రంగా అనిపించింది..
ఎంతోమంది సినిమాపై ట్రోల్స్ చేసిన మరి కొంతమంది భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన.. అంతా కూడా సినిమా చూసి పాజిటివ్ టాక్ ని తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు..
ఈ సినిమాకు అన్నీ కొత్తగానే జరిగాయి. షూటింగ్ జరిగిన తీరు.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చోటు చేసుకున్న పరిణామాలు.. ట్రైలర్ లేకపోవడం.. ఒక కొత్త సినిమా కొత్త అనుభూతితో తీస్తున్నామనుకున్నాం కానీ, స్పందన కూడా ఇంత కొత్తగా ఉంటుందనుకోలేదు” అన్నారు నాని. (Nani) ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ప్యారడైజ్. (The Paradise) కయాదు లోహర్ కథానాయిక. మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఈ మూవీ విడుదలైన సందర్భంగా శనివారం చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాని మాట్లాడారు…
మరో పదేళ్లు ‘ఆయా షేర్’ వినిపిస్తుంది..
“ఇటీవల విడుదలవుతున్న సినిమాల విషయంలో ఒక పరిణామం జరుగుతోంది. రిలీజ్ అయిన ఉదయం పాజిటివ్ టాక్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ, ప్యారడైజ్కు రివర్స్ అయింది. ప్రతి షోకు ఆదరణ వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ సొంత చిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘ప్యారడైజ్’ హీరో సినిమా కాదు. చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు కూడా ఎంతో కష్టపడ్డారు. రోజుల తరబడి నమ్మి ప్రాణం పెట్టి చేశారు. మీరంతా రియల్ హీరోస్. ప్రేక్షకులు థియేటర్కు రావడానికి కారణాల్లో అనిరుధ్ సంగీతం కూడా అందులో ఒకటి. మరో పదేళ్లు ‘ఆయా షేర్’ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది”