తెలంగాణ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా పట్టించుకోకుండా.. ఆంధ్రాకు నీటిని వదిలి మన పంటలను ఎండబెడుతున్న రేవంత్ ప్రభుత్వం!
ఇది ఎల్నినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ఇచ్చిన కరువు..
రైతులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో మా పోరాటం ఆగదు..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని దేశిటిక్యాల గ్రామ శివారులో రైతులతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే, పాలమూరు రైతాంగాన్ని రేవంత్ నిలువునా ముంచేసిండు. కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లున్నా, మోటార్లు పెట్టి ఎత్తిపోయకుండా, తన గురువు చంద్రబాబు దగ్గర పిల్లిలా మారిపోయిండని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం ఉందని తెలిసినా కాని పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి పంపులను పూర్తి స్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు…
కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సి. లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.