బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది…రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం దేశం ఎదురు చూస్తుంది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా….

హుజూర్ నగర్ విజయ విద్యా మందిర్ (VVm) పాఠశాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

స్వాతంత్ర భారత దేశంలో చరిత్ర సృష్టించాము

తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన సన్న బియ్యం అందించింది కాంగ్రెస్ పార్టీ.

గతిలో దేనికి పనికిరాని దొడ్డు బియ్యం అందించారు వాటిని అందరూ అమ్ముకునేవాళ్లు.

గౌరవ ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి సహకారంతో పేదవాడికి మంచి క్వాలిటీ సన్నబియ్యం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ.

చాలా చోట్ల బీజేపీ పార్టీ అధికారంలో ఉంది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సన్న బియ్యం అందిస్తుంది ఒక్క కాంగ్రె పార్ట్ మాత్రమే దీనివల్ల రాష్ట్రంలో 90 శాతం మంది పేద ప్రజలు సన్న అన్నం తింటున్నారు.

గత brs హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
నిరుపేదల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్ అందిస్తున్నాము.

నాకు అత్యంత సంతృప్తి కలిగిన సంఘటన ఈ తెల్ల రేషన్ కార్డు అందిస్తున్న సందర్భం.

రాష్ట్రంలో ఒక కోటి ఆరు లక్షల కార్డులు ఇచ్చినం వీటి ద్వారా మూడుకోట్ల మంది సన్నబియ్యం తీసుకుంటున్నారు.

సూర్యాపేట జిల్లా లో మూడు లక్షల పై చిలుకు కొత్త కార్డులు అందిస్తున్నాము
దీని ద్వారా పది లక్షల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త కార్డులు లక్ష పైచిలుకు కార్డులు అందించడం జరిగింది

దిని ద్వారా మూడు లక్షల
మంది లబ్ది చెందుతున్నారు.

నిస్సదేహంగా రాహుల్ గాంధీ ప్రధాని కానున్నారు.

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది.

రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం దేశం ఎదురు చూస్తుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మోసం చేస్తూ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వివరించారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కంకణబద్ధులై పనిచేస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు…