కుమార్తెపై తండ్రి అమర ప్రేమ మరణించిన కుమార్తె జ్ఞాపకాలను శాశ్వతంగా చేస్తూ గుడి నిర్మించిన తండ్రి నాగర్కర్నూల్ జిల్లా చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే తండ్రి భావోద్వేగ నిర్ణయం 2024లో వ్యాధితో మరణించిన 13 ఏళ్ల కుమార్తె జ్ఞాపకార్థం రూ. 2 లక్షల వ్యయంతో ఆలయం కుమార్తె గుడిలో ప్రతిరోజూ దీపారాధన చేస్తూ, నివాళులర్పిస్తున్న తండ్రి..।
సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్ చుక్కాయిపల్లిలో ఓ తండ్రి తన కుమార్తెపై చూపిన అపారమైన ప్రేమ అందరినీ కలచివేస్తోంది. 2024లో మెదడు సంబంధిత వ్యాధితో మరణించిన తన 13 ఏళ్ల కుమార్తె జ్ఞాపకార్థం రమేష్ అనే తండ్రి సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఒక చిన్న గుడిని నిర్మించారు. తన కుమార్తె జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉండాలనే ఆకాంక్షతో, ఆ ఆలయంలో ప్రతిరోజూ దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.