ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చే తరుణంలో గుర్తుతెలియని దుండగులు చేసిన పంట వినాశనానికి ఒక రైతు నిలువునా మునిగిపోయాడు.
వాయిస్ ఓవర్:
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామ సరిహద్దు సర్వే నెంబర్ 29. రెండున్నర ఎకరాలు, చింతకుంట్ల మల్లారెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని గుర్తుతెలియని దుండగులు ట్రాక్టర్తో తొక్కించి నాశనం చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధిత రైతు చింతకుంట్ల మల్లారెడ్డి కథనం ప్రకారం… సర్వే నంబర్ 29లోని తన రెండున్నర ఎకరాల పొలంలో రాత్రింబవళ్లు కష్టపడి వరి సాగు చేశారు. ఎరువులు, పురుగుమందులు చల్లి, నీళ్లు పెట్టి ఎంతో ఆశతో పంటను పెంచారు. సరిగ్గా పంట చివరి పొట్ట దశకు వచ్చి, కొద్దిరోజుల్లో చేతికి అందుతుందనగా… రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆకతాయిగా అక్రమంగా పొలంలోకి ప్రవేశించారు.
దుండగులు కేవలం పంటను తొక్కింపజేయడమే కాకుండా, పొలానికి నీరందించే బోరు బావులను, విద్యుత్ వైర్లను, మోటార్ కనెక్షన్లను ధ్వంసం చేశారు. అనంతరం ట్రాక్టర్తో మొత్తం 2.5 ఎకరాల వరి పైరును దున్నేసి పూర్తిగా నాశనం చేశారు… పచ్చని పంటపై రాక్షసుల ప్రవర్తించిన దుండగులు..
ఉదయమే పొలానికి వెళ్లి చూసిన మల్లారెడ్డి, పూర్తిగా ధ్వంసమైన తన పంటను చూసి గుండెలు అవిసేలా రోదించారు.
న్యాయం చేయాలని డిమాండ్:.
ఈ దారుణానికి ఒడిగట్టిన అరాచకవాదులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, స్థానిక రైతులు కోరుతున్నారు. శ్రమించి పండించిన పంటను దుర్మార్గంగా నాశనం చేసిన దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతుకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు..